Saturday, September 1, 2018

కష్టాలు సుఖాలవుతాయి!

⚛⚛⚛⚛⚛⚛

*🌸కష్టాలు సుఖాలవుతాయి!*🌸

*🌺దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారా మస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే!*
*దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః!!*🌺

అమ్మవారిని డబ్బు ఇమ్మని అర్థించే శ్లోకం ఇది. ఈ శ్లోకం చదివేటప్పుడు చేతులు చాచి ఉంచాలి. వర్షం కురవాలంటే మేఘాలు అలముకోవాలి. అవి కూడా నీళ్లు నిండిన మేఘాలై ఉండాలి. నీళ్లు నిండుకున్న మేఘాలు అలముకున్నంత మాత్రాన వర్షం పడుతుందన్న గ్యారంటీ లేదు. గాలి వీయాలి. ఆ గాలి కూడా పైరగాలి లాంటిదై ఉండాలి. వర్షం కురవాలంటే మేఘాలుండాలి. ధన వర్షం కురవాలంటే ‘అమ్మ వారి కళ్లు’ అనే మేఘాలుండాలి. నీ దయే దాన్ని అనుసరించి వీచే గాలి తల్లి! ధన వర్షమే కురవాలి. చాతక పక్షి ఏ నీళ్లో తాగదు కదా! అలాగే నేను కూడా మరో దేవతను ఆశ్రయించకుండా నిన్నే ఆశ్రయించా! పూర్వ కర్మ సరిగ్గా లేదంటున్నావు కదా! అది చెమట రూపం అనుకో! వర్షం కురిసే ముందు గాలి వీయగానే చెమట పోయినట్టుగా నీ దయ అనే వర్షం కురిస్తే ఆ పూర్వజన్మ కర్మలన్నీ పోతాయి కదా! మళ్లీ ఎప్పటికీ ఆ కర్మలు దరిచేరకుండా చేయలేవా తల్లీ! పైరగాలి చెమటను సుగంధం చేసినట్టే భగవానుగ్రహం మన కష్టాలను సుఖాలుగా మారుస్తుంది.
*🌹ఇష్టా విశిష్టమతయోపియయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే!*
*దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః!!*

తటాకాలు తవ్వించడం అందరి వల్లా కాదు. యజ్ఞయాగాదులు చేయించడం అందరి వల్లా కాదు. కానీ వారు అమ్మవారిని భక్తితో ‘నేను అవన్నీ చేయలేనమ్మా!’ అని వేడుకుంటే ఆ అమ్మ కరుణిస్తుంది. అటువంటి వారి మీద అమ్మవారి దయ పడితే స్వర్గభోగాలు కూడా సులభంగానే వస్తాయి. పద్మంలో ఉండే అమ్మవారి దృష్టి నాయందు పడును గాక! నా ఇష్టములను తీర్చును గాక!
డా. గరికిపాటి నరసింహారావు

⚛⚛⚛⚛⚛⚛




No comments:

Post a Comment